వరంగల్ చౌరస్తా : వరంగల్ నగరంలోని పాతబీట్ బజార్లో ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. మంగళవారం దాతల సహకారంతో ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంఘాలైన వాసవి సేవాదళ్, మహిళా సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అనుబంధ సంఘాల సహకారంతో మజ్జిగ, పులిహోర, అరటి పండ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నేటి నుండి వేసవి ఉష్ణోగ్రతలు తగ్గే వరకు వరకు నిత్యం మజ్జిగ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గార్లపాటి నాగేంద్రబాబు, కోశాధికారి గందె శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్ కుమార్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ గార్లపాటి శ్రీనివాస్, పొట్టి శ్రీనివాస్ మహిళా విభాగం అధ్యక్షురాలు చొల్లేటి కళావతి, ప్రధాన కార్యదర్శి గార్లపాటి శ్రీలత, కోశాధికారి రాజమణి, సుప్రియ, తదితరులు పాల్గొన్నారు.