హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 15: కాకతీయ యూనివర్సిటీలోని పోతన గర్ల్స్ హాస్టల్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని, మంగళవారం రాత్రి 10గంటలకు బుర్ఖా వేసుకున్న యువకుడితో బైక్‌పై వచ్చి మొదటి గేటు నుంచి లోపలికి రావడం చూసి కొందరు విద్యార్థులు అడ్డుకున్నారు. బుర్ఖా వేసుకున్న వ్యక్తి బూట్లను చూసి అనుమానం వచ్చి నిలదీయగా అతడు యువకుడు అని తెలిసి దాడి చేశారు. విషయాన్ని కేయూ హాస్టల్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు తెలియజేయగా కేయూ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వచ్చి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తీసుకొచ్చిన విద్యార్థినిని యూనివర్సిటీ అధికారులు మందలించి వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కేసు పెట్టలేదని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు విద్యార్థినిని వారం పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కేయూ హాస్టల్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.