తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
వృత్తిదారులు ప్రగతి సాధిస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో రామవరం గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి శుక్రవారం ఆయన గొర్రెలు పంపిణీ చేశారు.
- ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
- సంక్షేమ సంబురాల్లో ఎమ్మెల్యే అరూరి రమేశ్
- హాజరైన ఎంపీ పసునూరి దయాకర్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు
- ఎమ్మెల్యే అరూరి రమేశ్
- లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
వర్ధన్నపేట, జూన్ 9: వృత్తిదారులు ప్రగతి సాధిస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో రామవరం గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి శుక్రవారం ఆయన గొర్రెలు పంపిణీ చేశారు. అనంతరం మండల పశువైద్యాధికారి డాక్టర్ రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అరూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో రాష్ట్రంలోని వృత్తిదారులకు చేయూతనిస్తున్నారని కొనియాడారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో మొదటి విడుత గొర్రెల పంపిణీలో 3,404 మంది లబ్ధిదారులకు రూ. 59.57 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేశామన్నారు. రెండో విడుతలో 2,836 మందిని ఎంపిక చేసి రూ. 49.63 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పేదల కోసం పని చేస్తున్న సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే రమేశ్ కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, ఆత్మ చైర్మన్ గోపాల్‌రావు, మున్సిపల్ చైర్‌ప్సన్ ఆంగోత్ అరుణ, రామవరం సర్పంచ్ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు రామకృష్ణ, రవీందర్, పశుసంవర్ధక శాఖ అధికారులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ దేశానికే ఆదర్శం
కరీమాబాద్: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అరూరి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మామునూరులో సంక్షేమ సంబురం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు ఆనందంగా జీవించాలనే సంకల్పంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రజలకు రూ. 2427 కోట్ల 40 లక్షల 70 వేల విలువైన సంక్షేమ పథకాలు అందాయన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ మార్నేని మధుమతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 159 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు 1,69,67,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. 25 మందికి రూ. 10,47,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. గొర్రెల పంపిణీలో భాగంగా రూ. 10.50 లక్షల విలువల గల 6 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఐనవోలు, హసన్‌పర్తి మండలాలకు చెందిన ఐదుగురికి బీసీ రుణాలను అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభల బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

