ధర్మసాగర్, ఏప్రిల్ 4 : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పదివేల మంది కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరవాలని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే టీ రాజ య్య పిలుపునిచ్చారు. ధర్మసాగర్, వేలేరు మండల కేంద్రాల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మనకు దగ్గరలోనే ఈ సభ జరుగనుందని, అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.
దేశమంతా వ్యతిరేకిస్తున్న హెచ్‌సీయూ భూముల విషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమర్థించడానికి సిగ్గు ఉండాలన్నారు. అక్రమంగా చెట్లను నరికి వేయడం వల్ల వన్యప్రాణులన్నీ రోడ్ల మీదకు వస్తున్నాయని అన్నారు. వాటిని చూస్తే హృదయం చలించిపోతున్నదని అన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పు కుంటున్నారే తప్ప పనితనంలో చూపించలేకపోతున్నారని అన్నారు. దేవాదుల 3వ దశ పైపులైన్ మోటర్ల నిర్వహణకు రూ. 6 కోట్లు తెప్పించలేకపోవడాన్ని విమర్శించారు.
ఆగమేఘాల మీద వచ్చి తమకే పేరు దక్కాలని మోటర్లు ఆన్‌చేసేందుకు వస్తే అవి సహకరించలేదని అన్నారు. మండల ఇన్చార్జులు కర్ర సోమిరెడ్డి, భూపతి రాజు, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ మామిడి రవీందర్ యాదవ్, నాయకులు బొడ్డు ప్రభుదాస్, మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, లక్క శ్రీనివాస్, మారబోయిన రాజు, మహేందర్, హరీశ్, రమేశ్, మధు, ప్రవీణ్, రమణాకర్, విప్లవ్, కిట్టు, లక్ష్మి, రవిచందర్ పాల్గొన్నారు.
– మాజీ ఎమ్మెల్యే రాజయ్య