హనుమకొండ, జూన్ 13 : కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు. గురువారం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో హమాలీల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా, లేకున్నా సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లాలో కార్మిక సంఘం భవన నిర్మాణానికి భూమి కేటాయించామని తెలిపారు. గతంలో మే నెలలో కార్మికుల ఉత్సవాలను 30 రోజులు నిర్వహించామని, ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ వల్ల మూడు రోజులు మాత్రమే నిర్వహించామన్నారు
. కేసీఆర్ కార్మికుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు రూపొందించారని, 33 జిల్లాల్లో కార్మిక భవన నిర్మాణాల కోసం భూమిని కేటాయించారన్నారు. ఉచిత హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు, పిల్లల చదువుల కోసం, ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఎంతగానో ఈ సంఘాలు ఉపయోగపడతాయన్నారు. ఆటో, తాపీ మేస్త్రీ, భవన నిర్మాణం, రిక్షా, పేపర్ బాయ్స్, షాప్‌లు, హోటల్స్‌లో పనిచేసే కార్మికులు ఇలా అనేక సంఘాలతో మమేకమై పనిచేస్తూ వారి సమస్యల పరిషారానికి కృషి చేస్తున్నానని తెలిపారు.
కార్మికులకు అండగా ఉండి, కుటుంబ సభ్యుడిలా కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భవన నిర్మా ణ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎంజాల మల్లేశం, మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు సంజీవ్, ట్రేడ్ వరర్స్ యూనియన్ అధ్యక్షుడు గాదరబోయిన కొమురయ్య, ఉపాధ్యక్షుడు గొంగళ్ల వెంకన్న, కార్యదర్శి సన్నబోయిన రవి, కార్యవర్గ సభ్యులు మల్లేశ్, రామ్మూర్తి, కుమారస్వామి, రాములు, కొండ య్య, యాకయ్య, అంజయ్య, రాజు, దేవేందర్ పాల్గొన్నారు.