బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. ఆదివారం ఆయన హనుమకొండకు రాగా, గులాబీ సైన్యం పెద్ద ఎత్తున హాజరై ఘన స్వాగతం పలికింది. ముందుగా బీఆర్ఎస్ సీనియర్ నేత కూతురు వివాహానికి హాజరయ్యారు. అనంతరం హనుమకొండలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరగా, కడిపికొండ నుంచి స్వాగతం పలికేందుకు కార్యకర్తలు బైక్ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పార్టీ ఆఫీసు వద్ద పార్టీ శ్రేణులు, జాగృతి నాయకులు పుష్పగుచ్ఛం అందజేశారు. అక్కడ విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అదేవిధంగా ఇటీవల కంటి ఆపరేష న్ చేయించుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
– హనుమకొండ, నవంబర్ 10
హనుమకొండ, నవంబర్ 10: కేటీఆర్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ ద్వారం వద్ద జన గామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని ఘన స్వాగతం పలికారు. స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో శాలు వాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. అలాగే బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్దపెండ్యాల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద కేటీఆర్‌ను స్వాగతించారు. అక్కడి నుంచి పార్టీ సీనియర్ నేత తక్కళ్లపళ్లి సత్యనారాయణ రావు కూతురు వివాహానికి హాజరయ్యారు. అనంతరం హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వస్తూ కడిపికొండ నుంచి బైక్ ర్యాలీగా వచ్చారు.
కాజీపేట, ఫాతిమానగర్, సుబేదారి ప్రాంతాల్లో కార్యకర్తలు కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయినప్పటికీ ఏ ఒక్కటి అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కొత్త హామీలు దేవుడెరుగు ఉన్న వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నపోటు పొడిచిందన్నారు. కేటీఆర్ మాట్లాడుతున్న క్రమంలో కార్యకర్తలు జోష్‌తో ఈలలు వేయడం, జై కేటీఆర్ అనడంతో పాటు కేటీఆర్‌తో ఫొటోలు, సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు.
కేటీఆర్ సైతం కార్యకర్తలతో ఫొటోలు దిగారు. కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసుదనా చారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథో డ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్, జడ్పీ మాజీ చైర్మన్ సుధీర్‌కుమార్, మాజీ కార్పొ రేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, కే వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్‌రావు, బొంగు అశోక్ యాదవ్, ఇండ్ల నాగేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్లు దాస్యం విజయ్‌భాస్కర్, జోరిక రమేశ్, విద్యార్థి సంఘం నాయకులు, వీరేందర్, రాకేశ్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకులు జానకిరాములు, నయీముద్దీన్, పోలపల్లి రామ్మూర్తి, వెంకన్న, రఘు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకొన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హనుమకొండలోని ఆయన నివాసానికి వెళ్లి పరా మర్శించారు. అనంతరం అక్కడి నుంచి సిరిసిల్లకు వెళ్లే క్రమంలో ఎల్కతుర్తి వద్ద హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ ఆద్వర్యంలో కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు.