కృష్ణ కాలనీ, సెప్టెంబర్ 18 : భూపాలపల్లి అభివృద్ధిపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శీతక న్ను వేశాడని, సొంత మండలమైన గణపురంపై ఉన్న ప్రేమ జిల్లా కేంద్రంపై లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో సు భాష్ కాలనీ రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి మంజూరైన రూ. 10 కోట్ల నిధులను దారి మళ్లించి గణపురం అభివృద్ధికి వా డుకోవడాన్ని నిరసిస్తూ గురువారం జిల్లా కేం ద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబేదర్ సెంటర్ నుంచి కేటీకే ఓసీ-2 వరకు ఉన్న సుభాష్ కాలానికి వెళ్లే రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి టీ యూఎఫ్ఐడీసీ నిధుల నుంచి రూ. 6 కోట్లు, సింగరేణి సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 4 కోట్లు తీసుకొచ్చి పనులు ప్రారంభించానన్నా రు. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర ఆ నిధులను కలెక్టర్ ఉత్తర్వుల మేరకు క్యాన్సిల్ చేయించి, తన సొంత మండలమైన గణపురం అభివృద్ధికి తీసుకువెళ్లాడన్నారు. అంతేకాకుం డా అనేక రకాల నిధులను దారి మ ళ్లించి పట్టణ అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయాడన్నారు.
ఎమ్మెల్యే కేవలం గణపురం మండలం ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారా? పట్టణవాసులు ఓట్లేయలేదా? అని ప్రశ్నించారు. ఎ మ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గెలిచిన తర్వాత భూపాలపల్లి అభివృద్ధిలో చాలా వెనుకబడిందని, పట్టణంపై సవతి తల్లి ప్రేమ చూ పిస్తున్నాడని మండిపడ్డారు. కనీసం కొత్త ని ధులైనా తీసుకొవచ్చి ఎందుకు అభివృద్ధి చే యడం లేదని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఎమ్మె ల్యే సత్యనారాయణరావు తన తప్పును తెలుసుకొని వెంటనే సుభాష్ కాలనీ రోడ్డు వెడ ల్పు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి నిధులు తీసుకువచ్చి రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించకుంటే బీ ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ధర్నా చేస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తుండగా, యూత్ నాయకులు అడ్డుపడ్డారు.
దీం తో బలవంతంగా వారిని తీసుకెళ్తుండగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ పటేల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ నూనె రాజు పటేల్, కౌన్సిలర్లు ముంజంపల్లి మురళీధర్, జకం రవికుమార్, మంగళపల్లి తిరుపతి, జాగృతి జి ల్లా అధ్యక్షుడు మాడ హరీశ్ రెడ్డి, నాయకులు సెగ్గం సిద్ధ్దు, బీబీచారి, బండారి రవి, పూర్ణచందర్, సుధాకర్, కృష్ణమూర్తి, రాజు, శ్రీకాంత్పటేల్, దుండ్ర కుమార్ యాదవ్, మోతే రాజు, భాగ్య, స్వప్న, పుష్ప, మహేందర్, దీలీప్, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.