నర్సింహులపేట(తొర్రూరు), అక్టోబర్ 4 : భారీ వరదలతో మహబూబాబాద్ జిల్లాలో పంటలన్నీ కొట్టుకుపోయి ఆగమైన రైతులను ఆదుకుంటానని మాటిచ్చిన ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి.. నాలుగు నెలలైనా నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. వంట చేలలో ఇసుక మేటలు, రాళ్లు వచ్చి చేరి రైతులకు కోలుకోని దెబ్బ తగిలిందని రేవంత్‌కి రైతుల మీద ప్రేమ ఉంటే ఎంతో ఇప్పటికైనా వెంటనే సాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశా రు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గంలో రుణమాఫీ కానీ రైతులతో తొర్రూరులో ఏర్పాటుచేసిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బస్టాండ్ నుంచి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఎడ్లబడిపై ధర్నా కార్యక్రమానికి చేరుకొని ప్రసంగించారు. వరంగల్ డిక్లరేషన్ సభ లో రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతుభరోసా రూ.15వేలు, రైతు రుణమాఫీ రూ.2 లక్షలు, రైతు కూలీలకు రూ.12 వేలు, అసైన్డ్ పట్టాదారులకు పట్టాలిస్తామని హామీలు ఇచ్చారని అవన్నీ ఎకడికి పోయాయని అడిగారు.
ఒక పాలకుర్తిలోనే 4,314 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. అలాగే మహిళలకు బతుకమ్మ చీరలకు బదులు రూ.500 ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు దేవుళ్లపై ఒట్టేసి హామీలు అమలు చేస్తానని మొనగాడిలా చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మోసగాడు అని హరీశ్‌రావు విమర్శించారు. రుణమాఫీ కాలేదని, రైతుభరోసా రాలేదని, ధాన్యానికి బోనస్ ఇవ్వలేదని ఏ ఒక రైతూ ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని హామీలన్నీ నెరవేరేదాకా బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
దసరా పండుగ లోపు 2లక్షల రుణమాఫీ చేయకపోతే ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని హరీశ్ స్పష్టంచేశారు. రుణమాఫీ కాలేదని డోర్నకల్‌లోని ధరావత్ తండా లో ధారవత్ రవి, దుబ్బాకలో సురేందర్‌రెడ్డి లు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశా రు. రైతులు చనిపోతుంటే కనీసం కనికరించని కేసీఆర్‌ది రైతుల గుండె అయితే రేవంత్‌రెడ్డిది రాతి గుండె అని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తం గా భారీ వర్షాలతో నష్టపోయిన పంటల ను, కొట్టుకపోయిన రోడ్లను చూసి సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలకు ఫోజులిచ్చారు తప్ప ఇప్పటి వరకు ఇస్తామన్న పరిహా రం ఇవ్వలేదని అన్నారు.
దేవుడిపై ఒట్లు పెట్టి మోసం చేసినందుకు రేవంత్‌రెడ్డిని క్షమించి ప్రజలను కాపాడాలని యాదా ద్రి నరసింహస్వామిని వేడుకున్నానని.. అందుకు తనపై కేసులు పెట్టారని కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా 32 కేసులు పెట్టారని అయినా వెనుకాడేది లేద ని స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం 300 కేసులు పెట్టారని, ఇప్పుడు రైతుల కోసం, ప్రజల కోసం 30 కేసులు ఓ లెక కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, వాసుదేవారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, గాంధీనాయక్, మంగళపల్లి శ్రీనివాస్, తూర్పాటి చిన్నఅంజయ్య, శాంత, సీతారాములు, శ్రీనివాసరావు, ప్రదీప్‌రెడ్డి, ఐలయ్య ఉన్నారు.
రైతులకు ఇచ్చిన మాట తప్పి బ్రోకర్ మాటలు మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు చేస్తున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్‌రావు భయానికే 40శాతం రుణమాఫీ చేశాడని రైతులందరికి రుణమాఫీ చేసేవరకూ పోరాటం ఆగదన్నారు. పంటలకు రూ.500ల బోనస్ అని ఇప్పుడు సన్నవడ్లకు అని చెబుతున్నాడని ఇలా అబ్ధదాలు, బ్రోకర్ మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడని సీఎం అయిన తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడని ధ్వజమెత్తారు.
కేసీఆర్ హయాంలో ఎడారిగా ఉన్న పాలకుర్తి నియోజకవర్గంలో 365 రోజులు పుష్కలంగా నీళ్లు, 24 గంటల విద్యుత్, అదునుకు రైతుబంధు, పంటలకు గిట్టుబాటు ధర వచ్చేవని ఎర్రబెల్లి గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని తండాలకు రోడ్డు సౌకర్యం కోసం రూ.200 కోట్ల అభివృద్ధి నిధులిస్తే ములుగుకు తీసుకెళ్లారన్నారు. అలాగే 100 పడుకల దవాఖాన, సీసీరోడ్డు, వాటర్‌ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. కొంతమంది పార్టీ మారినంత మాత్రాన నష్టం ఏమీలేదన్నారు. హరీశ్‌రావు రైతుల కోసం ఎంతో పోరాటం చేస్తున్నాడడని రుణమాఫీ అయ్యేదాకా ముఖ్యమంత్రిని వదలిపెట్టేది లేదన్నారు.
– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ప్రమాణ స్వీకరం చేసిన రెండు నిమిషాల్లో రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి 10 నెలలైనా ఆ హామీని నెరవేర్చకపోవడం దురదృష్టకరం. 6 గ్యారెంటీల్లో ఒకటి మినహా మిగిలినన్నీ తుంగలో తొకి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎకడా లేని విధంగా తెలంగాణలో దుర్మార్గ పాలన నడుస్తున్నదని రైతులందరూ కదం తొకి రుణమాఫీ అయ్యేవరకూ విశ్రమించవద్దు. ఏడారిగా ఉన్న ప్రాంతాల్లో రైతులకు సాగునీరు అందించిన మహానుభావుడు కేసీఆర్. దండగ అన్న వ్యవసాయాన్ని పండగ చేసి రైతులకు భరోసా కల్పించారు. ఈ దుర్మార్గ పాలన అంతమొందించేందుకు రైతులంతా పోరాటాలకు సిద్ధం కావాలి.
– సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి ప్రతిపక్ష నేత
అధికారంలోకి రాక ముందు అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇపుడు సీఎం బోగస్ మాటలు చెబుతున్నడు. డిసెంబర్ 9 పోయింది ఇప్పుడు సన్నవడ్లు అంటున్నడు. మోసం చేయడం తప్ప ఏమీ లేదు. రూ.2 లక్షల రుణమాఫీ మొదట్లో రూ. 42 వేల కోట్లు అన్నడు. కేబినెట్లో రూ.31 వేల కోట్లన్నడు. అ తర్వాత అసెంబ్లీలో రూ.26 వేల కోట్లు అన్నడు. చివరకు రూ.7, 8 వేల కోట్లు ఇయ్యలే. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేయాలని హరీశ్‌రావు పోరాటం చేయకపోతే ముఖ్యమంత్రి రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టకపోయేది. పైగా ఆయనపైనే తిట్ల దండకం చేస్తున్నాడు. చిత్తశుద్ధి ఉంటే ముందు చెప్పినట్లు అందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేయాలి. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రపంచా దేశాల్లో ఎక్కడా లేని విధంగా రైతుబంధు ద్వారా 11 సార్లు రూ.72వేల కోట్లు అందించిన చరిత్ర కేసీఆర్‌ది.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
నర్సింహులపేట : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటే ఆశపడి ఓటేసిన. నాకు రెండెకరాల భూమి ఉంది. రూ.50,000 బ్యాం కు అప్పు ఉంటే అదే మాఫీ కాలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి రెండు పంటలు సాగుచేసినా ఇప్పటివరకు రైతుబంధు రాలేదు. ముఖ్యమంత్రిది ఒకమాటైతే.. మంత్రులది మరోమాట ఉంటాంది. పనులు వదులుకొని మాఫీ పైసల కోసం బ్యాంకు, వ్యవసాయ అధికారుల చుట్టు తిరిగినా ఎవరూ సమాధానం చెప్పడం లేదు. కేసీఆర్‌ను ఓడగొట్టి తప్పు చేసినం. రుణ మాఫీ కాలేదు. రైతుబంధు రాలేదు. మా కోసం బీఆర్ఎస్ వాళ్లు పోరాటం చేస్తుంటే ఇక్కడకు వచ్చిన.
– జాటోత్ జోగ్యా, ఎల్బీ తండా, చిన్నవంగర
సీఎం రేవంత్‌రెడ్డి రైతులందరికీ రుణమాఫీ చేశామంటే.. మంత్రి తుమ్మల మాత్రం సగం మందికే ఇచ్చామంటారు. అసలు ఎవరి మాట నిజమో రైతులు అర్థం చేసుకోవాలి. రైతుబంధువు కేసీఆర్ అయితే ప్రజలందరినీ కష్టాల్లో నెట్టేసిన రైతుల ద్రోహి రేవంత్‌రెడ్డి. కొవిడ్ కష్టకాలంలో మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను నిలిపేసి రైతులకు రైతుబంధు అందించిన మహానాయకుడు కేసీఆర్ అయితే అందరినీ నట్టేట ముంచిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రైతుబంధు ఆపేదే లేదన్నాడు.
ఇప్పుడున్న సీఎం రైతులు కౌలు రైతులకు, రైతు కూలీలకు డబ్బులు ఇస్తానని మోసం చేసిండు. రైతులంటే ప్రేమ లేదా మీకు. బిడ్డా ఇలా చేస్తే ఊరుకోం. రైతుకు ఎంత అప్పు ఉన్నా 2లక్షలు బ్యాంకు ఖాతలో జమ చేయాల్సిందే. కేసీఆర్‌ను, బీఆర్స్ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నావు. గాలికి ఏది పడితే అది మట్లాడుడితే ఖబడ్డార్ అని హెచ్చరిస్తున్నాం. మహిళా జాతి తలదించుకునేలా ఓ మంత్రి చౌకబారు మాటలు మాట్లాడుతోంది. నోరు మూసుకొని ముందు ప్రజా సమస్యలపై దృష్టిపెడితే బాగుంటుంది.
– సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి
రుణమాఫీ, రైతుబంధుపై సీఎం, మంత్రులకు అవగాహన లేదు. కొవిడ్ సమయంలో కేసీఆర్ రైతుబంధు అందరికీ ఇచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ రైతుబంధు ఇవ్వలేదు. కానీ రుణమాఫీ చేస్తామని బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడు. కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామని రాష్ట్రంలోని మహిళలు, రైతు లు ప్రజలు బాధపడుతున్నరు. రుణమాఫీ చేసే వరకూ పోరాటం చేస్తాం. జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలకు చెరువులు, కుంటలు తెగిపోయి పంటలు నష్టపోయినా నష్టపరిహారం ఇవ్వకపోవడం బాధాకరం. బేషరతుగా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి.
– మాలోత్ కవిత, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఏ ఊరికైనా ముసుగు వేసుకొని రావాలి. హరీశ్‌రావు కూడా నీ వెంట వస్తడు. రైతు రుణమాఫీ పూర్తయిందా అని రైతులను అడుగు. ఆ తర్వాత ముసుగు తీస్తే రైతులే నీ పని చెప్తరు. ఎన్నికల ముందు దేవుళ్లపై ఒట్టు వేసి ఎన్నో హామీలిచ్చావు. ఇప్పుడు ఏవీ నెరవేర్చకపోవడం వల్ల ఆ శాపమే నిన్ను పట్టుకుంది. ఆరు గ్యారెంటీలు అమలుచేసే వరకూ పోరాటం ఆగదు. ఉద్యమంలో ఎలాగైతే పోరాటం చేశామో అలాగే హరీశ్‌రావుతో కలిసి 6 గ్యారెటీల అమలు కోసం పోరాటం చేస్తాం.
– ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి