వేలేరు : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి దయతోనే ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గెలిచారని, పల్లాని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి లేదని హనుమకొండ జిల్లా వేలేరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచి రెండు సంవత్సరాలు కావొస్తున్న వేలేరు మండల కేంద్రంలో సైడ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పెట్టించే దమ్ము కడియంకు లేదని మండిపడ్డారు. మంగళవారం వేలేరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. సోమవారం వేలేరు మండలం పీచరలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ ఎమ్మెల్యే పల్లాపై చేసిన విమర్శలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
వేలేరు మండలంలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో కడియం శ్రీహరి మండల అభివృద్ధి ప్రధాత పల్లా పై చేసిన చేసిన విమర్శలను ఖండిస్తున్నట్లు తెలిపారు. వేలేరులో ఎమ్మెల్యే కడియం తన ఉనికిని చాటుకోవడం కోసమే మండల అభివృద్ధి ప్రధాత పల్లా పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పల్లా గత ప్రభుత్వంలో ధర్మసాగర్ శివారు నుండి వేలేరు వరకు సూమారు 35కోట్లతో డబుల్ బీటీరోడ్డు వేయించాడు. ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు కావొస్తున్న వేలేరు మండల కేంద్రంలోని డబుల్ రోడ్డుకు సైడ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పెట్టించే దమ్ము కడియం శ్రీహరికి లేదని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సూమారు రూ.104కోట్లతో సాగునీటి పనులకు అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తే పైపులైన్ పనులను పూర్తి చేయించలేని చాతకాని దద్దమ్మ కడియమని విమర్శించారు. వేలేరు మండలానికి సాగునీరు రావడానికి కర్త, కర్మ, క్రియ పల్లా రాజేశ్వర్ రెడ్డియే అని చెప్పి ప్రగల్భాలు పలికిన కడియం శ్రీహరి ఇప్పుడు పార్టీ మారి ఊసరవెల్లిలా రంగులు మార్చి పల్లా పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి పోయిన అని చెప్పుకునే కడియం లిఫ్ట్ – 2, 3 పనులకు సంబంధించిన బకాయిలను చెల్లించి పనులు పూర్తి చేయాలని సవాల్ విసిరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం కాదని, రైతుల కోసం పీచర శివారులో 90శాతం పనులు పూర్తైన సబ్ మార్కెట్ యార్డును పూర్తి చేసి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారం , కృషితోనే బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరికి బీ ఫామ్ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు మరిజె నర్సింహారావు, మాజీ వైస్ ఎంపీపీ సంపత్, నాయకులు మాధవరెడ్డి, జానీ, సంపత్, మహేందర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు