నర్సింహులపేట/ దంతాలపల్లి/ గూడూరు/ ఇనుగుర్తి/డోర్నకల్/గార్ల/చిన్నగూడూరు/కేసముద్రం, మే 1: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మహబూబాబాద్‌లో కేసీఆర్ రోడ్‌షోకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలారు. కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు చేశారు. నర్సింహులపేట మండలంలోని గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వెళ్లారు. మండల అధ్యక్షుడు మైదం దేవేందర్, వైస్ ఎంపీపీ జాటోత్ దేవేందర్, గుగులోత్ రవి, పాతూరి మధురెడ్డి, సత్తిరెడ్డి, నర్సింహారెడ్డి, అనిల్, వెంకన్న, శ్రీశైలం, రమేశ్, రామన్న ఉన్నారు.
దంతాలపల్లి మండలంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెళ్లారు. గూడూరు మండలంలోని అన్ని గ్రామాలు, తండాలు, గూడేల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తమ ద్విచక్ర వాహనాలపై ఎండను లెక్కచేయకుండా వెళ్లారు. పార్టీ రాష్ట్ర నాయకుడు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, వర్కింగ్ జలగం సంపత్‌రావు, వైస్ ఎంపీపీ ఆరె వీరన్న, శోభన్‌బాబు,
సుధాకర్‌రావు, మన్మోహన్రెడ్డి, రహీం, వెంకన్న, కఠార్‌సింగ్, మూడు మోహన్, బోడ కిషన్, బోడ ఎల్లయ్య, స్టాలిన్, అహ్మద్ ఆధ్వర్యంలో వేలాదిగా తరలివెళ్లారు. ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మద్దెల సుధాకర్ ఆధ్వర్యంలో డివిజన్ యూత్ ఉపాధ్యక్షుడు బండారి శ్రీనివాస్‌రెడ్డి, భూక్య బాలాజీనాయక్, బైరు కొమురయ్య, బొబ్బల ముత్తయ్య, వడపెల్లి కొండయ్య, బైరు భద్రయ్య, యూత్ నాయకులు వడపెల్లి సందీప్, చెడుపాక సురేష్, కముటం నాగేందర్ ఉన్నారు.
డోర్నకల్ మున్సిపాలిటీ, మండలంలోని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మండల అధ్యక్షుడు నున్నా రమణ, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కత్తెరసాల విద్యాసాగర్, ధరంసోత్ బాలూ నాయక్, వార్డు కౌన్సిలర్లు పోటు జనార్థన్, బోరగళ్ల శరత్ బాబు, హేమచంద్రశేఖర్, కందుల అరుణ, ఎంపీటీసీ బానోత్ వంకర్ కోటి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు షేక్ అజిత్ మియా, బీఆర్ఎస్ నాయకులు కొత్త వీరన్న, కాలా యశోధర్ జైన్, గౌస్ పాషా, పచ్చిపాల శ్రీనివాస్, కందుల మధు, చంటి పాల్గొన్నారు.
గార్ల మండలంలోని గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు వాహనాల్లో తరలివెళ్లారు. మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్‌నాయక్, ఎంపీటీసీ రమేశ్, పానుగంటి రాధాకృష్ణ, గాజుల గణేశ్ పాల్గొన్నారు. చిన్నగూడూరు మండల కేంద్రంతోపాటు గుండంరాజుపల్లి, తదితర గ్రామాల పెద్ద సంఖ్యలో వెళ్లారు. శ్రీను, శంకర్, బలపాల శ్రీను, అశోక్, అంజి, విజయ్ ఉన్నారు. కేసముద్రం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా బీఆర్ఎస్ నాయకులు, రైతులు, విద్యావంతులు స్వచ్ఛందంగా తరలివెళ్లారు. నాయకులు పెద్దగాని వెంకన్న, లింగాల పిచ్చయ్య, మోడెం రవీందర్‌గౌడ్, దరావత్ చందు, రాంబాబు, గౌండ్ల వెంకన్న, ఎలుక బ్రహ్మచారి ఉన్నారు.