కమలాపూర్/నయీంనగర్, డిసెంబర్ 5 : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పరకాల, హుజూరాబాద్ నాలుగు లేన్ల రహదారిపై బీఆర్ఎస్ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు మాట్లాడుతూ.. తన ఫోన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నాడని కౌశిక్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, తప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించినట్లు చెప్పారు. అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతులను నొక్కలేరని, అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేను వెంటనే విడుదల చేయాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు బీఆర్ఎస్ నేతలను యత్నించగా పోలీసులు వారిని అ దుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లడె గోపాల్, మా ట్ల వెంకటేశ్వర్లు, శనిగరపు సమ్మ య్య, శ్రీనివాస్, రాజు, బాబు, రాజయ్య తదితరులున్నారు.
అలా గే, అక్రమ అరెస్టులకు నిరసనగా హనుమకొండలోని కేయూ మొదటి గేట్ వద్ద బీఆర్ఎస్వీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చే స్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి తన అధికారబలం తో పోలీసులను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయించడం సరైంది కాద ని బీఆర్ఎస్వీ రాష్ట్ర సీనియర్ నాయకులు కొ మురయ్య, కేయూ ఇన్చార్జి జెట్టి రాజేందర్, అరూరి రంజిత్, సుమన్ అన్నారు. రానున్న రోజుల్లో ప్రతికార చర్యలకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలని, లేని పక్షంలో ప్రజా తిరుగుబాటు తప్పదని వారు హెచ్చరించారు.