సుబేదారి/నయీంనగర్/వరంగల్ చౌరస్తా, మే 11 : కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం పలుచోట్ల ధర్నాలు చేపట్టారు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయం ప్రధాన గేట్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట నాయకుడు దాస్యం విజయభాస్కర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ బాలికపై అఘాత్యానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకోకపోవడం, రేంవత్‌రెడ్డి ప్రభుత్వం కాపాడడం సిగ్గుచేటన్నారు.
బండి సంజయ్ కుమారుడికి ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా? అని విజయభాస్కర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బండి సంజయ్ కుమారుడిని అరెస్ట్ చేయాలి, బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాలి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అలాగే భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలోనూ ధర్నా చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యత వహించి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని, కుమారుడిని పోలీసులకు అప్పగించి చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్వీ నాయకులు బైరపాక ప్రశాంత్, కంజర్ల మనోజ్, జెట్టి రాజేందర్, కలకోట్ల సుమన్, నరేందర్, శ్రీకాంత్, సందీప్, మహేశ్‌గౌడ్, ప్రకాష్‌గౌడ్, స్నేహిత్, వినీల్‌రావు, ఇస్మాయిల్, భార్గవ్, అదిత్య, రాయుడు సీతా తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ రూరల్, మే 11: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్‌ను పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతిరోజు దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నాని చెప్పే సంజయ్ తన కొడుకు అఘాయిత్యం చేస్తే ఏమీ జరగలేదని వెనకేసుకురావడం దారుణమన్నారు. ఇంత జరిగినా కూడా ఏమీ ఎరుగనట్లు ప్రధాని మోదీ సభలో పాల్గొనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. బేటీ బచావో అంటూ నినాదాలు చేస్తూ, నీతి వాఖ్యాలు పలికే బీజేపీ నేతలకు తమ మంత్రి కొడుకు బాలికపై లైంగికదాడి చేయడంపై ఖండించాలన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్ర హోంశాఖ మంత్రిగా నిర్వహిస్తున్న రేవంత్‌రెడ్డి కుమ్మక్కై ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బాలికకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ప్రజలకు ఏమీ న్యాయం చేస్తారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.
హనుమకొండ : కేంద్ర సహాయ మంత్రి బం డి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరె స్ట్ చేయాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై లైంగికదాడి చేశాడని మైనర్ బాలిక తన తల్లిదండ్రులతో కలి సి నాలుగు రోజుల క్రితం పేట్ బషీర్‌బాగ్ పోలీ సు స్టేషన్లో భగీరథ్‌పై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు అతడిని అరెస్ట్ చేయకపోవడాన్ని దేశవ్యాప్తంగా ప్రజాసామ్య వాదులు ఖండిస్తున్నారన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీ నాయకులుగా నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు సెక్షన్లను మార్చి దానిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయం గా హోం శాఖ మంత్రిగా ఉన్నారని, గతంలో చాలాసార్లు ఎవరికి అన్యాయం జరిగినా, సెలబ్రిటీలైనా శిక్షిస్తామని చెప్పిన మాటకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీతో మిలాఖత్ కాకుంటే వెంటనే భగీరథ్‌ను అరెస్ట్ చేయాలన్నా రు. కాంగ్రెస్ జాతీయ నాయకులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని అంటుంటే రేవంత్‌రెడ్డి ప్ర భుత్వం మాత్రం బీజేపీకి వంతపాడుతూ నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తున్నదన్నారు. అంతేకాక బాధితులకు రక్షణగా ఉండాల్సిన వారే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. బీజేపీతో మి లాఖత్ అయి, మోదీతో చీకటి ఒప్పందం చేసుకొని ఆ పార్టీ నాయకులకు కవచంగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి తీరును ఎండగట్టేందుకు ఉద్యమిస్తామన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని దాస్యం అన్నారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, మాజీ కార్పొటర్లు జోరిక రమేశ్, సారంగపాణి, నాయకులు పులి రజనీకాంత్, జనార్దన్‌గౌడ్, నయీముద్దీన్, పోలపల్లి రామ్మూర్తి పాల్గొన్నారు.
కృష్ణకాలనీ, మే 11 : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలది ఫెవీకాల్ బంధమని మరోసారి రుజువైందని, చట్టం ఒక్కరికే చుట్టంలా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ బాలికపై లైంగిక దాడి చేశాడని ఆరోపణలు రావడం, అతడిపై పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదై నాలుగు రోజు లు అవుతున్నప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం, భగీరథ్‌ను అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
అతడిని అరెస్ట్ చేసి జైలుకు ఎందుకు పంపలేదో రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాదానం చె ప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చి న ప్రధాని మోదీ భగీరథ్ అరాచకాలు, ఆ యనపై నమోదైన పోక్సో కేసు గురించి నోరు మెదపకపోగా, బండి సంజయ్‌ను పొగడ్తలతో ముంచెత్తడంపై, బాధితురాలి పైనే ఒత్తిడి తేవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. పోలీసులు, ప్రభుత్వం, బండి సంజయ్ మీడియాను మేనేజ్ చేసి, బాధితురాలిని బెదిరించేలా వ్యవహరిస్తున్నారే తప్ప బాలికకు న్యాయం చేయాలనే ఉద్దేశం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని, సీఎం, ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే కేసుపై పారదర్శకంగా విచారణ జరపాలన్నారు.
నెల్లికుదురు, మే 11 : బాలికపై లైంగిక దాడి చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, మంత్రి పదవి నుంచి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై 48 గంటలైనా ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిందితుడిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. బాధితురాలి కుటుంబాన్ని బెదిరించినందుకు, సాక్ష్యాలను దాచిపెట్టే ప్రయత్నం చేసినందుకు బండి సంజయ్పే, బాధితురాలు, కుటుంబానికి రక్షణ కల్పించాలని,
మెజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్ రికార్డు చేయాలని డిమాండ్ చేశారు. పేట్ బషిరాబాద్ పోలీసులపై చర్యలు తీసుకొని, ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేసిన అధికారులను సస్పెంచ్ చేయాలన్నారు. నిందితులకు శిక్షపడి బాధితురాలికి న్యాయం జరిగే వరకూ బీఆర్ఎస్ వారికి అండగా నిలుస్తుందన్నారు. సమావేశంలో సీతామహాలక్ష్మి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పరుపాటి వెంకట్‌రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి వెన్నాకుల శ్రీనివాస్, నాయకలు ఎర్రబెల్లి నవీన్‌రావు, బత్తిని అనిల్, వీరగాని మల్లేశ్, బోజ్యానాయక్, బిక్కునాయక్, మాన్సింగ్, చిర్ర శ్రీనివాస్, పెరుమాండ్ల ఉపేందర్, రామన్నగూడెం సర్పంచ్ బండి శ్రీనివాస్ పాల్గొన్నారు.