హనుమకొండ, ఏప్రిల్ 12 : ‘కేసీఆర్‌ను విమర్శించే స్థాయా నీది? అడ్డిమార్ గుడ్డి దెబ్బల ఎమ్మెల్యేగా గెలిచినవ్. నువ్వు కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోవు. గింత ఉన్నోనివి.. స్థాయి మరి చి మాట్లాడుతున్నవ్.. పెద్దోళ్లను తిడితే పెద్దోడివైపోతామనుకుంటున్నవ్.. అలాంటి నాయకుల్లో నువ్వు ఫస్ట్ ఉంట వ్’ అంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిపై బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు.
శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘అరవై ఏం డ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్.. సూర్యుడిలాంటి ఆయనపై విమర్శలు చేయ డం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్టేనన్నా రు.
కేసీఆర్, రజతోత్సవ సభ, పర్మిషన్లపై మాట్లాడే స్థాయా నీది? అని ప్రశ్నించారు. అన్ని అనుమతులతోనే వరంగల్ జిల్లాలో ఇప్పటికే ప్రపంచం, జాతీయ స్థాయి నాయకులు అబ్బురపడేలా సభలు నిర్వహించామన్నారు. కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన నాయకుడు అన్నారు. గాంధేయ మార్గంలో తెలంగాణను సాధించి అంబేద్కర్, ఫూలే ఆలోచనల మేరకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కేటీఆర్ ఐటీకి అంబాసిడర్‌గా నిలిచారని, ఇంకోసారి వారిని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ బాగోతాలు బయటపెడతామన్నారు. కేసీఆర్ 25 ఏండ్ల క్రితం ఉద్యమం మొదలు పెట్టినప్పుడు నువ్వు ఎకడున్నావని ప్రశ్నించారు. బతుకుదెరువు కోసం వచ్చి ఎన్ని బాగోతాలు ఆడావో తమకు తెలుసన్నారు. నీ పదవీ కాలం ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోయిందని, మరో రెండు, మూడేండ్లలో మొత్తం అయిపోతుందని ఎద్దేవా చేశారు. మా సభల జోలికి వస్తే ఉరుకునేది లేదని వినయ్ భాస్కర్ హెచ్చరించారు. సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, నయీముద్దీన్, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
బాలకాలిలో కడియం
ఎమ్మెల్యే కడియం శ్రీహరి బాలకాలిలో పడ్డాడు. 15 రోజుల నుం చి సోయి తప్పి మాట్లాడుతున్నాడు. దేవునూరు భూములను కబ్జా చేస్తున్నప్పటికీ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఏమీ మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. అంటే కడియం శ్రీహరి, మంత్రి సురేఖ కుమ్మక్కయ్యారనిపిస్తున్నది. ప్రజలను పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రెస్మీట్లో కేటీఆర్‌పై మాట్లాడుతూ అతి చిన్న వయస్సులో కేటీఆర్ పెద్ద అబద్ధాలు అడుతున్నాడని అన్నాడు. మరి నువ్వు చిన్నగా ఉండి కేటీఆర్‌పై మాట్లాడుతున్నావు. నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు. ఇదే రకంగా మాట్లాడితే అతని మీద మా కార్యాచరణ ప్రకటించి బుద్ధి చెబుతాం. కడియం శ్రీహరికి నీతి నిజాయితీ ఉంటే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందే రాజీనామా చేయాలి.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే
కడియంకు రాజకీయ పునర్జన్మనిచ్చింది కేసీఆర్
చచ్చిన పాములాగా ఉన్న కడియం శ్రీహరికి ఊపిరినిచ్చి రాజకీయ పునర్జన్మనిచ్చింది కేసీఆర్. స్టేషన్‌ఘన్‌పూర్ పేరు చెప్పి 30 ఏళ్ల నుంచి రాజకీయ పబ్బం గడుపుతున్న శ్రీహరి గులాబీ కండువా, పల్లా రాజేశ్వర్‌రెడ్డి దయ, కార్యకర్తల కృషితో గెలిచినవ్. పల్లా రాజేశ్వర్‌రెడ్డి భిక్షతో డిప్యూటీ సీఎం అయినవ్. కేసీఆర్‌ను బ్లాక్మెయిల్ చేసి పార్టీ ఫండ్ తీసుకొని రూ. 100 కోట్లకు అమ్ముడు పోయినవ్. దేవునూరు గుట్టలను చెరబడుతున్నావు. బినామి పేర్లతో భూములు కొన్నావు. ఫిరాయింపుల చట్టంపై అవగాహన లేని వ్యక్తి కడియం. స్టేషన్‌ఘన్‌పుర్ నియోజక వర్గానికి, దేవాదులకు నువ్వు చేసిందేమీలేదు.
– తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే
సభకు ‘త్రిచక్ర’ విరాళం రూ. 1,00,116
బీఆర్ఎస్ సభకు హనుమకొండలోని త్రిచక్ర పొదుపు సంఘం రూ. 1,00,116 విరాళం ప్రకటించింది. శనివారం బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌కు చెక్కును అందజేశారు. 27న సభకు 800 ఆటోలతో స్వచ్ఛందంగా రావడంతో పాటు ప్రజలను తరలిస్తామని సంఘం అధ్యక్షుడు ఇసంపల్లి సంజీవ తెలిపా రు. ఆటో కార్మికులకు కేసీఆర్ అండగా నిలిచారని, రోడ్‌ట్యాక్స్ మాఫీ చేశారన్నారు. హనుమకొండ జిల్లాలో ఆటో కార్మికులకు బీమా సౌక ర్యం కల్పించిన ఘనత దాస్యంకే దకుతుందన్నారు. త్రిచక్ర సంఘానికి సైతం వినయ్‌భాసర్ రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు మంద శ్రీధర్‌రెడ్డి, చీకటి కుమార్, మడికొండ బాబు, కలకోట్ల జయరాం, స్వామి, సంజీవ, బాబు, వెంకటేశ్వర్లు, రమేశ్ పాల్గొన్నారు.