పరకాల: బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్లో జూన్ 1న ఘనంగా జరుగనున్నాయి. వేడుకల్లో పాల్గొనడానికి డల్లాస్ వెళ్లిన మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి (పరకాల), వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), పెద్ది సుదర్శన్ రెడ్డి (నర్సంపేట).. అమెరికాలోని పెద్ద నగరాల్లో ఒకటైన హ్యూస్టన్లో ఉన్న పలు దేవాలయాలను సందర్శించారు. అష్టలక్ష్మి, శారదాంబ, షిరిడీ సాయి, జలారాం దేవాలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా టెక్సాస్ లోని రిచ్మండ్ ప్రాంతంలో ఉన్న శారదా పీఠాన్ని మాజీ ఎమ్మెల్యేల బృందం సందర్శించింది. కాగా పర్యటనలో మాజీ ఎమ్మెల్యేలతో భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఉన్నారు.