వరంగల్, ఏప్రిల్ 22 : ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నగరంలో ఫ్లెకీలు, పార్టీ జెండాలు ఏర్పా టు చేసేందుకు అనుమతివ్వాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేను కోరారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆమెను కలిసిన వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ సభ కోసం పార్టీ ఆధ్వర్యంలో వాల్ పెయింటిం గ్స్, సిక్కర్లు, బంటింగ్ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సభ పూర్తయే వరకు తొలగించకుండా ఆదేశాలివ్వాలని కమిషనర్‌ను కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు మరుపల్ల రవి, దిడ్డి కుమారస్వామి, సిద్దం రాజు, ఆవాల రాధికారెడ్డి, బొంగు అశోక్‌యాదవ్, చెన్నం మధు, సోదా కిరణ్, ఇమ్మడి లోహిత, నాయకులు మసూద్, రాజు, నర్సింగరావు తదితరులు ఉన్నారు.