పదుల సంఖ్యలో ఉన్న విలీన గ్రామాల ప్రజలు దర్గా కాజీపేట రైల్వే గేట్ మీదుగానే నగరానికి వెళ్లాలి. ఇక్కడ గేట్ పడిందంటే ఒక్కోసారి అర గంటకు పైగా వేచి చూడాల్సిందే. నిత్యం వాహనాలను గేట్ కింది నుంచి వంచుతూ సర్కస్ ఫీట్లు చేయడం షరామామూలే. ఒకవేళ అత్యవసరమైతే సుమారు 10 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సిందే. ఇక్కడి ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల క్రితం ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. అప్పటి నుంచి పనులు నత్తనడకన నడుస్తుండగా, ఓ పక్క ఇంకా మొదలే పెట్టలేదు. రైల్వే గేట్ తిప్పలు తప్పేదెప్పుడని స్థానికులు, ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
– కాజీపేట, జనవరి11
కాజీపేట రైల్వే జంక్షన్-విజయవాడ సెక్షన్లో ఫోర్త్ లైన్ నిర్మాణం చేయడం తో దర్గా రైల్వే గేట్ మీదుగా ప్రతిరోజు దాదాపుగా 150కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటా యి. కొండపర్తి, అమ్మవారిపేట, భట్టుపల్లి, కొత్తపల్లి, కడిపికొండ, పవన్‌నగర్, గాంధీనగర్, ఇందిరానగర్, బుడిగ జంగాల కాలనీ, బోడగుట్ట, బియాబానీ దర్గాకు వెళ్లేవారు ఈ గేట్ మీదుగానే ప్రయాణిస్తుంటారు. గేట్ పడిందంటే ఆగాల్సిందే. ఒక్కోసారి రెండు, మూడు రైళ్లు వెళ్లిపోయే వరకు వేచి ఉండాల్సి వస్తుంది. కాజీపే ట, హనుమకొండ, వరంగల్ పట్టణాలకు ఆయా విలీ న గ్రామాల ప్రజలు వెళ్లాలంటే సుమారుగా 10 కిలోమీటర్లకు పైగా దూరంగా తిరిగి వెళ్లాల్సి వ స్తోంది.
స్థానిక ప్రజలు, బియాబానీ భక్తులు గేట్ మూ సి ఉంటే ద్విచక్రవాహనాలు, సైకిళ్లను గేట్ కింది నుంచి దాటి వెళ్ల డానికి ప్రయత్నించి రైళ్లతో ప్రాణాలు పోగొట్టుకోవడం, ఎంతో మంది గాయాల బారిన పడిన సం దర్భాలు ఉన్నాయి. దర్గా రైల్వే గేట్ వద్ద ప్రజల ఇబ్బందులను చూసిన అప్పటి స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఫ్లై ఓవర్ రైల్వే బ్రిడ్జికి రెండున్నరేండ్ల క్రితమే శ్రీకారం చుట్టారు. మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ. 68 కోట్లు, స్థల సేకరణకు అదనంగా రూ. 15 కోట్లు మంజూరు చేయించగా, పనులు ప్రారంభమయ్యాయి.
ప్రస్తుత ప్రజాప్రతినిధులు, అధికారుల పట్టింపులేని కారణంగా దర్గా రైల్వే ైప్లె ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం జరుగుతున్నది. ఒక వైపున మాత్రమే అడపాదడపా పనులు జరుగుతుండగా, మరోవైపు ముహూర్తానికే నోచుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ైప్లె ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందోనని, తమ బాధలు ఎప్పుడు తీరుతాయోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తమ తిప్పలు తీర్చాలని కోరుతున్నారు.
రోజూ రైల్వే గేట్ దాటడాని కి ప్రయాణికులు పడుతు న్న బాధలు వర్ణనాతీతం. ఓ రైలు పోతుందనుంటే మరో రైలు వస్తున్నది. గంటల తరబడి గేట్ ముందు నిలబడాల్సి వస్తున్నది. కొందరు గేటు దాటడానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వెంటనే దర్గా ఫ్లై ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేయాలి.
– సింగారపు బాబురావు, వాహనదారుడు, కడిపికొండ
దర్గా ఫ్లై ఓవర్ బ్రిడ్జి పను లు యుద్ధప్రాతిపాదికన చే పట్టాలి. గతంలో కంటే ఎ క్కువగా రైళ్ల రాకపోకలు ఎ క్కువ కావడంతో నిముషాల్లోనే గేట్ పడుతున్నది. దీం తో వివిధ పనులపై నగరానికి, విలీన గ్రామాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నాం. ఫ్లె ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
– అంబాల రమేశ్, గాంధీనగర్, దర్గా