హనుమకొండ, అక్టోబర్ 12: ప్రముఖ కమ్యూనిస్టు నేత కామ్రేడ్ బీఆర్ భగవాన్ దాస్ 22వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ జూనియర్ కాలేజీ జంక్షన్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ రావడంలో పోరాడిన మహానీయుడు అని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, సిపిఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆజంజాహి మిల్లు పరిరక్షణ పోరాటం, ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేసిన ఘనత బీఆర్ భగవాన్దాస్కే దక్కుతుందన్నారు.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్వాసరావు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషితో పాటుగా పోరాటాలు చేశారన్నారు. హమాలీ, గీత, టైలర్, ఆటోరిక్షా, సినిమా, భూనిర్వాసిత కార్మికులకు, ప్రజల తరపున నిరంతరం అండగా ఉద్యమాన్ని చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణితో పాటు మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, స్వామిచరణ్, సీపీఐ నేతలు జ్యోతి, కరుణాకర్, బుద్దభవన్ డెవలప్ కమిటీ సభ్యులు, భగవాన్దాస్ కుటుంబ సబ్యులు డాక్టర్ రాజసిద్ధార్థ, బీఆర్ లెనిన్, అంబేడ్కర్ ఉన్నారు.