Greater Warangal | కరీమాబాద్, మే 26 : గ్రేటర్ వరంగల్ తూర్పు నియోజకవర్గం 32వ డివిజన్ లోని జై బీమ్ స్మశాన వాటిక అభివృద్ధిలో భాగంగా సోమవారం స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శ్రీ పల్లం పద్మ రవి బోరు వేయించారు. కాగా ఈ సందర్భంగా కార్పొరేటర్ పల్లం పద్మ రవి మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి పనుల్లో భాగంగా స్మశాన వాటికలో ప్రాంగణం లోపల స్నానపు గదులు, రూములలో లాకర్లు వంటి మొదలైన సదుపాయాలు ఏర్పాటు కానున్నాయని అన్నారు.
పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, అలాగే నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయించి ఎన్నో ఏళ్లుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు సందీప్, బొమ్మల అంబేద్కర్, నీలం మల్లేశం, నీలం వినీత్, సంబంధిత అధికారులు, యవకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.