భీమదేవరపల్లి, జనవరి 21: వడ్డెర సంఘం భీమదేవరపల్లి మండల అధ్యక్షులుగా బొమ్మిశెట్టి రమేష్ నియామకమయ్యారు. ఈ మేరకు తెలంగాణ వడ్డెర సంఘం , చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు బొమ్మిశెట్టి రమేష్ మాట్లాడుతూ.. వడ్డెర సంఘం సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బొమ్మిశెట్టి రమేష్ నియామకం పట్ల వడ్డెర సంఘం నాయకులు వల్లెపు కనకయ్య, సుధాకర్, గొల్లెన రమేష్, అశోక్, కుమారస్వామి, బొమ్మిశెట్టి సంపత్ హర్షం వ్యక్తం చేశారు.