తొర్రూరు, మే 9 : భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్‌కేకన్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీ చేపట్టారు. తొర్రూరు మండలంలోని అన్ని కీలక ప్రాంతాల్లో విసృ్తత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), ఫారెస్ట్, స్పెషల్ ఫోర్స్, బాంబు స్వాడ్, డాగ్ స్వాడ్ ఇతర విభాగాల నుంచి 50మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని బస్టాండ్, లాడ్జీలు, మారెట్ ప్రాంతం, బస్సులు, వాహనాలు, పాలకేంద్రం తదితర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ తనిఖీలను తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిశోర్ స్వయంగా పర్యవేక్షించారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. అలాగే దినుబండారాలు కూడా తినకూడదన్నారు. ఈ తనిఖీల్లో తొర్రూరు సీఐ టౌటం గణేశ్, ఎస్సైలు గొల్లమూడి ఉపేందర్, రమేశ్, రాజు, క్రాంతి కిరణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
డోర్నకల్/నర్సింహులపేట/మరిపెడ, మే 9 : భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో శుక్రవారం జిల్లా ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు డోర్నకల్‌లో బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద సీఐ భూక్యా రాజేశ్ ఆధ్వర్వంలో, నర్సింహులపేట మండల వ్యాప్తంగా ఎస్సై మాలోత్ సురేశ్ ఆధ్వర్యంలో ట్రైనీ ఎస్సై ఖాదర్పాషాతో కలిసి, మరిపెడలో సీఐ రాజకుమార్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అనుమానిత వ్యక్తులు, వాహనాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నర్సింహులపేటలో ఎస్సై ఉమ, ఏఎస్సై కోటేశ్వరావు, కానిస్టేబుల్ వీరన్న, నరేశ్, రాములు, మరిపెడలో మరిపెడ, చిన్నగూడురు, సీరోలు మండలాల ఎస్సైలు బొలగాని సతీశ్, ప్రవీణ్, నగేశ్ పాల్గొన్నారు.
కురవి : భారత దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న యుద్ధ వాతావారణం, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దులో జరుగుతున్న మావోయిస్టుల కూంబింగ్లను పురస్కరించుకుని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్(ఐపీఎస్) ఆదేశాల మేరకు కురవి మండల కేంద్రంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారిపై కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ శుక్రవారం సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.