బచ్చన్నపేట ఆగస్టు 5 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం 22వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చన్నపేట టౌన్ అధ్యక్షుడు గంధ మల్ల కిష్టయ్య జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల పక్షాన ప్రతి సమస్యకు ముందుండి పరిష్కరిస్తున్న ఏకైక సంఘం బీఎన్ఆర్ కేఎస్ అని అన్నారు. కార్మికుడు బతికున్నంత వరకు లేబర్ కార్డును కొనసాగించాలని, 50 సంవత్సరాలు నిండినా ప్రతి కార్మికుడికి 5000 రూపాయల పెన్షన్, ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
అనంతరం బి.ఎన్.ఆర్.కె కార్మికుడు పెనిమిల్లి కిష్టయ్య అనారోగ్యానికి గురై గత రాత్రి మృతి చెందగా బచ్చన్న పేట టౌన్ అధ్యక్షులు గంధమల కృష్ణయ్య విషయం తెలుసుకొని నిత్యం మనతో కలిసి పని చేసినటువంటి కార్మికుడు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శించి మృత దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి 3000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో, రాగిరి సత్యనారాయణ, అల్వాల రాజు, కొల్లూరు రామచంద్రం, దేవరకొండ వెంకటయ్య, పెనిమిల్లి నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.