పర్వతగిరి, జూలై 6 : చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. అచంచలమైన విశ్వాసంతో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి తన కలను సాకారం చేసుకున్నాడు. పర్వతగిరి మండలం కొంకపాకకు చెందిన లంబాడా గిరిజనుడు భూక్యా తిరుపతి మొకవోని దీక్షతో ముందుకు సాగి కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్గా నియమితుడై పలువురికి ఆదర్శంగా నిలిచాడు.
భూక్యా తిరుపతి ప్రాథమిక విద్య నాలుగో తరగతి వరకు కొంకపాక గ్రామంలో, పదో తరగతి వరకు పర్వతగిరి బీసీ హాస్టల్లో ఉండి చదువుకున్నాడు. ఇంటర్మీడియ ట్ రాజర్షి జూనియర్ కాలేజీలో, డిగ్రీ బీకాం సీకేఎం కళాశాలలో పూర్తి చేశారు. ఉదయం కళాశాలకు వెళ్లి సాయం త్రం, సెలవు రోజుల్లో చిన్నచిన్న కూలి పనులు చేసుకుం టూ చేదోడువాదోడుగా ఉండి కష్టపడి చదివాడు. ఎంఏ తెలుగు కోర్సు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో పూర్తి చేసి ప్రస్తుతం అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా నియమితులయ్యాడు.
ఎంఫిల్ ‘లంబాడా భాష సాహిత్యం-తెలుగు భాషా ప్రభావం’, ‘తెలంగాణ ప్రాంతీయవాదం’ అంశం మీద ఆచార్య పిల్లలమర్రి రాములు పర్యవేక్షణలో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. 2005లో మొదటిసారిగా కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో అసి స్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరారు. 2005 నుంచి 2022 వరకు ద్రావిడ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. అనంతరం 2022లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉద్యోగం లో చేరారు. ఇటీవల తెలుగు విభాగంలో ప్రొఫెసర్గా ప దోన్నతి పొందారు. ఇప్పటి వరకు తిరుపతి ఎనిమిది పుస్తకాలు రచించి ప్రచురించారు.
వివిధ అంశాల మీద వివిధ సాహిత్య పత్రికల్లో 50 వరకు వ్యాసాలు రాశారు. పలు విశ్వవిద్యాలయాల్లో దాదాపు 100 వరకు జాతీయ, అం తర్జాతీయ సదస్సుల్లో పాల్గొని వివిధ అంశాలపై పత్రాలు సమర్పించారు. తిరుపతి పర్యవేక్షణలో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థులకు పీహెచ్డీ పూర్తి చేశారు. ఇటీవల ఆ యన ప్రొఫెసర్గా బాధ్యతలు స్వీక రించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశా రు. తాను పీజీ చేసిన యూనివర్సిటీలోనే ప్రొఫెసర్గా నియామకం కావడం తనకు ఎంతగానో గుర్తుండిపోయే విషయమని తిరుపతి పేరొన్నారు.