భూపాలపల్లి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా కలెక్టర్ భవేశ్ మిశ్రా శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖులు, ఉన్నతాధికారులు మొక్కలు నాటి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు., రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కింద కలెక్టర్ భవేశ్‌మిశ్రా మూడు మొక్కలు నాటి, ములుగు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనాలని నామినేట్ చేశారు. కాగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని ఇతర జిల్లాల కలెక్టర్లను నామినేట్ చేసినందుకును ఎంపీ సంతోష్‌కుమార్ కలెక్టర్ భవేశ్ మిశ్రాకు కృతజ్ఞతలు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.