వరంగల్, జూలై 21 : వరంగల్ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారు శాకంబరీ అలంకణలో భక్తులకు దర్శనమిచ్చారు. 15 రోజుల పాటు కనులపండువగా జరిగిన ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. శాకంబరీ అలంకరణ, గురుపౌర్ణమి నేపథ్యంలో భద్రకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రధాన అర్చకుడు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో ఉదయం 3 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన అర్చకులు అమ్మవారిని ఐదు క్వింటాళ్ల వివిధ కూరగాయలతో అలంకరించారు.
ఉదయం 10 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా భక్తులు పెద్ద సంఖ్యల తరలివచ్చి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అలాగే గురు పౌర్ణ మి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని సాయిబాబా దేవాలయంలో భక్తులు పూజలు చేశారు. కాగా, వ రంగల్ పశ్చిమ, భూపాలపల్లి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, గం డ్ర సత్యనారాయణరావు దంపతులు అమ్మవారిని దర్శంచుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో శేషు భారతి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు.