పోచమ్మమైదాన్, జనవరి 7 : వరంగల్ దేశాయిపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ వైద్య బృందం శనివారం సందర్శించింది. తమిళనాడు, ఢిల్లీకి చెందిన వైద్యులు బాలకిషన్, చెందిన మిన్నేలు అనిల్‌కుమార్ రోగులకు అందుతున్న సేవలతో పాటు రికార్డులను పరిశీలించారు. లేబర్ రూం, మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్, జనరల్ క్లినిక్, అడ్మినిస్ట్రేషన్, వ్యాధి నిరోధక టీకాలు, కుటుంబ నియంత్రణ సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మాతాశిశు సంరక్షణ ఆరోగ్య విషయాలపై ప్రజలకు అందిస్తున్న అవగాహన కార్యక్రమాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలకిషన్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. దవాఖానల్లో అందిస్తున్న సేవలు, నాణ్యతా ప్రమాణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ తంగళ్లపల్లి భరత్‌కుమార్, డాక్టర్ రవీందర్, డాక్టర్ రాము నాయక్, క్వాలిటీ మేనేజర్ హారిక, అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.