నల్లబెల్లి, మార్చి 20 : ఐసీడీఎస్‌లో సూపర్ వైజర్ ఉద్యోగం పొందిన ఉడుత మౌనికను బీసీ నేతలు సన్మానించారు. నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఉడుత రాజన్న, రమణి దంపతుల రెండవ కుమార్తె మౌనికను చాలా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి, భోగ భద్రయ్య డాక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ సామల వీరన్న శ్రీహరి కడియాల క్రాంతి, వేముల రాజు, సామల లక్ష్మీనారాయణ మౌనికతో పాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించడం జరిగింది.
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ పూర్తి చేసిన మౌనిక భద్రాద్రి జోన్లో తొమ్మిదవ ర్యాంకు సాధించి గ్రేడ్ -1 ఫలితాల్లో అంగన్వాడీ సూపర్ వైజర్ ద్యోగాన్ని సాధించింది. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ మౌనికను ఆదర్శంగా తీసుకుని గ్రామాల్లోని బీసీ బిడ్డలందరూ కష్టపడి చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వ కొలువులు అందరికీ రాకపోయినా ఇతర రంగాలలో రాణించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా సమాజాన్ని చైతన్య పరచడానికి ప్రతి ఒక్కరికి చదువు దోహదపడుతుందన్నారు.