చెన్నారావుపేట : ఈనెల 27న ఎలుకతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెన్నారావుపేట బీఆర్ఎస్ పార్టీ మండల బాధ్యుడు బాల్నే వెంకన్న అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మరాంపాడు, పాపయ్యపేట గ్రామాలలో రజతోత్సవ సభ సన్నాక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ఆటో యూనియన్ సభ్యులను, గౌడ కుల సంఘం నాయకులను కలిసి బీఆర్ఎస్ సభకు అందరూ కలిసి రావాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జక్కా అశోక్, పాపయ్య పేట గ్రామ అధ్యక్షుడు బుర్ర సుదర్శన్ గౌడ్, కొండవీటి ప్రదీప్, ముల్క సాంబయ్య, అమ్మ రాజేష్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.