వేలేరు : మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ( Hidma ) ఎన్కౌంటర్ నేపథ్యంలో ఎన్కౌంటర్ ( Encounter ) ను నిరసిస్తూ అనేక మంది సోషల్ మీడియాలలో పలు రకాల పోస్టులు పెడుతున్నారు. హిడ్మా ఫొటోతో కూడిన అనేక సందేశాలు, పలు ఉద్యమ గీతాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఈ క్రమంలో ఈనెల 21 న వరంగల్ జిల్లా వేలేరు మండలం సోడషపల్లికి చెందిన గ్రామస్థులు కొయ్యడ సురేష్, మేక భిక్షపతి హిడ్మాతో కూడిన ఫ్లెక్సీని (Hidma Flexi) గ్రామంలో ఏర్పాటు చేసి నివాళి అర్పించారు.
స్పందించిన వేలేరు పోలీసులు పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన సురేష్, భిక్షపతిని హన్మకొండ నాలుగో అదనపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయవాది రాచకొండ ప్రవీణ్ కుమార్ వారి తరఫున వాదనలు వినిపించి వారికి బెయిల్ మంజూరు చేయించారు.