వాజేడు, అక్టోబర్ 1 : విధుల్ల్లో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎంపీడీవో విజయ హెచ్చరించారు. అటెండర్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వడంతో పాటు త్వరలో జడ్పీ ఆఫీసుకు సరెండర్ చేయనున్నట్లు తెలిపారు.
కార్యాలయ గదిలోనే అటెండర్ సాయిబాబు నివాసం ఉండడం, సమయపాలన పాటించని ఉద్యోగుల తీరుపై మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘అది ఆఫీసా? ఇల్లా?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎంపీడీవో స్పందించి విచారణ జరిపారు. పలుమార్లు హెచ్చరించినా పనితీరు మారదా? అని అటెండర్‌పై ఆగ్రహం వ్యక్తంచేయడంతో పాటు వెంటనే ఆఫీస్ గదిని ఖాళీ చేయాలని చెప్పారు. అలాగే ఉద్యోగులను సైతం సమయపాలన పాటించాలని మందలించారు.