సుబేదారి, ఏప్రిల్ 4 : మానవత్వాన్ని మ రుస్తున్న మనుషులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న కారణాలతోనే తమ వారిని హత్య చేస్తున్నారు. అతి కిరాతకంగా మర్డర్ చే సి, ఆనవాళ్లు కనిపించకుండా దహనం చేస్తున్నారు. ఇటీవల వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంటున్న ఈ దారు ణ ఘటనలు సంచలనంగా మారాయి. గడిచిన మూడు నెలల్లో మొత్తం ఏడుగురు హ త్యకు గురికావడం ఆందోళనకు గురిచేస్తున్నది. భర్త చేతిలో భా ర్య, ఇద్దరు పిల్లలు, మరో ఘటనలో భార్య, మామను హత్యచేయడం భయకంపితులను చేస్తున్నది.
తండ్రి ప్రేమలో అల్లారు ముద్దుగా పెరగాల్సిన చిన్నారులు అతడి చేతిలోనే బలవుతున్నారు. ఇలాంటి పలు ఘటనల నేపథ్యంలో పలువురు చిన్నారులు అనాథలవుతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు తోడు మనిషిలోని మానవత్వం మంటగలిసి క్రూరత్వం, కఠినత్వం పెరుగుతున్నదని మానసిక నిపుణులు అంటున్నారు. చట్టమంటే భయంలేని కొందరు చిన్న చిన్న కారణాలతోనే హత్యలకు పాల్పడుతున్నారు. భార్యా భర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య గొడవలు జరిగినపుడు వాటిని పరిష్కరించకుండా పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
దీంతో కొందరు క్షణికావేశంతో, మరికొందరు తమ వివాహేతర సంబంధానికి అడ్డు ఉండకూడదని మర్డర్లు చేస్తున్నారు. ప్రధానంగా భార్య, భర్తల వివాహేతరల సంబంధాలు, డబ్బులు, ఆస్తుల గొడవలు, వర్నకట్నం కోసం వేధింపులతోనే ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు లేకుండా పోవడం, గొడవ చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకపోవడం, కుటుంబ పెద్దలకు దూరంగా ఉండడం, వృత్తిపరంగా కొత్త పరిచయాలు, భార్యా భర్తలకు ఒకరిపై ఒకరికి అనుమానాలు మర్డర్లకు దారితీస్తున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
హత్యచేసి ఇంట్లోనే దహనం
మడికొండ పోలీసు స్టేషన్ పరిధిలోని కడిపికొండ శి వారు రాజీవ్‌గృహ కల్ప సముదాయంలో మార్చి 18న అదనపు కట్నం కోసం భర్త ప్రవీణ్, భార్య రాజశ్రీ, మామ రాజశేఖర్‌ను ఇంట్లోనే సుత్తితో కొట్టి చంపి, ఆ తర్వాత డీజిల్ పోసి దహనం చేశాడు. పోలీసుల విచారణలో ప్రవీణ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.
డబ్బుల గొడవతో..
హసన్‌పర్తి మండలం సిద్దాపూర్లో ఇటీవల డబ్బుల విషయమై చోటుచేసుకున్న గొడవలో ఓ మరదలు తన అక్క భర్తను ఇనుప రాడ్‌తో కొట్టి చంపింది.
ఆడపిల్లలు వద్దని..
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్ గ్రామానికి చెందిన అజారుద్దీన్‌కు ఇద్దరు కూతుర్లున్నారు. భార్య ఇటీవల గర్భం దాల్చగా లింగ నిర్ధారణ చేయడంతో మళ్లీ ఆడపిల్లేనని తెలియడంతో ఆందోళన చెందాడు. పథకం ప్రకారం తన వెంచర్‌కు ముగ్గురిని తీసుకొచ్చి అందులోని స్విమ్మింగ్ పూల్ తోసేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలగా పూర్తి విచారణ కొనసాగుతున్నది.