హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 22: హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో అథ్లెటిక్స్పోటీలు(Athletics competitions) ఉత్సాహంగా జరిగాయి. గెలుపే లక్ష్యంగా అథ్లెట్లు సింథటిక్ ట్రాక్‌పై చిరుతలా పరుగులు తీశారు.
జిల్లాస్థాయి బాయ్స్అండ్ గర్ల్స్ అండర్-14, 16, 18, 20 అథ్లెటిక్స్చాంపియన్షిప్ పోటీలు భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల నుంచి సుమారు 600 మంది అథ్లెట్లు పాల్గొన్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి తెలిపారు. అక్టోబర్ 16,17,18 తేదీల్లో హనుమకొండలోని జేఎన్ఎస్లో ఇండియా ఓపెన్ అండర్-23 నేషనల్ అథ్లెటిక్స్చాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం గెలుపొందినవారికి అథ్లెట్లకు మెడల్స్, సర్టిఫికేట్స్అందజేశారు.