ఏటూరు నాగారం : ఆత్మవిశ్వాసం, మానసిక శాంతిని ధ్యానం పెంపొందిస్తుందని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం యోగా గురువు ఎర్రంకానీ రాంబాబు ఆధ్వర్యంలో యోగ మహోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మాట్లాడుతూ యోగ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆందోళన తగ్గించడం మనసు స్థిరపడేలా యోగతో సాధ్యమవుతుందని, టెన్షన్ ఆందోళన తగ్గుతాయని పేర్కొన్నారు.
ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఇతరుల పట్ల దయాభావం కలుగుతుందని పరస్పర ప్రేమ క్షమాభావాన్ని పెంచుతాయన్నారు. డిప్రెషన్ లక్షణాలను తొలగించడంలో సహాయపడుతుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వ్యక్తిగత అవగాహన మెరుగుపడుతుందని వివరించారు. ఆవేశాలను కంట్రోల్ చేయగలిగే సామర్థ్యం కలిగిన యోగాను అందరూ సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో యోగ గురువు రాంబాబు,సీఐ శ్రీనివాస్ శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్, సిఆర్పిఎఫ్ సీఐ రాంబాబు, ప్రొవిషనరీ ఎస్ఐలు సివిల్ సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.