ఖిలావరంగల్, ఆగస్టు 04 : గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్‌కు చెందిన సామాజికవేత్త మేరుగు అశోక్ సీసీ కెమెరాలను బహూకరించారు. సొంత ఖర్చులతో శివనగర్ ప్రభుత్వ పాఠశాల, శివ విఘ్నేశ్వర ఆలయం, నాలుగు జెండాల జంక్షన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా వాటిని వరంగల్ ఏఎస్పీ శుభం ప్రారంభించారు. కాగా భద్రత నేపథ్యంలో శివనగర్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన మేరుగు అశోక్‌ను స్థానికులు అభింనందించారు.
ఈ కార్యక్రమంలో మిల్స్‌కాలనీ సీఐ బొల్లం రమేష్, శివనగర్ స్కూల్ హెచ్ఎం నరేంద్రచారి, డివిజన్ పద్మశాలి అధ్యక్షుడు గడ్డం రవి, ఆలయం అధ్యక్షుడు కొండి రాజమౌళి, శ్యాం, రాంపెల్లి ఉపేందర్, యాదగిరి, బండి రమేష్, లక్ష్మీనారాయణ, కాసం రాజు, శీలం అశోక్‌రెడ్డి మారేడుపాక సతీష్, బేర కిషన్, వెంగళదాస్ కృష్ణ, దాసు జయ, స్వర్గం భాగ్యలక్ష్మి, యాదమ్మ, శ్రీదేవి, కీర్తన, సూర్యభాను తదితరులు పాల్గొన్నారు.