మట్టెవాడ, జూలై 29 : రాష్ట్ర ప్రభుత్వం ఆశవర్కర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని నిరసిస్తూ చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లే ఆశవర్కర్లను ముం దస్తుగా మట్టెవాడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ సం దర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు కాసు మాధ వి, జిల్లా కార్యదర్శి ముక్కెర స్వామి మాట్లాడుతూ ఆశవర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం చలో హైదరాబాద్కు వెళు తున్న వారిని ప్రభుత్వం ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.
అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశవర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంతోపాటు వారికి ప్రధాన డిమాండ్ అయిన రూ.18 వేల జీతాన్ని ఇస్తామని చెప్పి, ఇప్పుడు ముఖం చాటేయడం దారుణమన్నారు. చేసేదేమి లేక ఆశవర్కర్లు తమ నిరసన గళాన్ని వినిపించేందుకు హైదరాబాద్కు వెళుతుంటే మట్టెవాడ పోలీస్స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారని ఆరోపించారు. సమస్యలు నెరవేరే వరకూ తమ ఉద్యమం ఆగదన్నారు. అరస్టైయిన వారిలో అనిత, మరియ, రాణి, పద్మ, కవిత, గీత, మమత, జ్యోతి, శోభ తదితరులు ఉన్నారు.