హనుమకొండ చౌరస్తా, జూన్ 19 : హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బిఏ, బీకాం, బీఎస్సీ, 2,4,6(రెండవ, నాలుగవ, ఆరవ) సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య వల్లూరి రామచంద్రం, కేయు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుంకరి జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రెహమాన్ పాల్గొని ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా కేయూ వీసీ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి గల కళాశాలలో పరీక్షల ఫలితాలు వెనువెంటనే విడుదల చేయడం జరుగుతుందని, ఉత్తీర్ణత శాతం కూడా బాగా పెరుగుతుందని ఆయన అన్నారు.
ఇందులో రెండవ సెమిస్టర్ లో 1255 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 1236 మంది పరీక్ష రాయగా 620 మంది విద్యార్థులు (50.16) శాతం ఉత్తీర్ణత సాధించారు. 4(నాలుగవ), సెమిస్టర్ లో 952 మంది రిజిస్టర్ చేసుకోగా 927 మంది పరీక్ష రాయగా 540 మంది విద్యార్థులు (58.25%) ఉత్తీర్ణిత సాధించారు, అదేవిధంగా 6(ఆరవ సెమిస్టర్ లో) 765 మంది రిజిస్టర్ చేసుకోగా 742 మంది పరీక్ష రాయగా 582 మంది విద్యార్థులు 78. 44) శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలలో 59.97% ఉత్తీర్ణత సాధించినట్లు ఉపకులపతి పేర్కొన్నారు.
2. బి ఏ విభాగం రెండవ సెమిస్టర్ లో 345 మంది మహిళలు పరీక్షకు హాజరు కాగా, 160 మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా 112 పురుషులు పరీక్షకు హాజరుకాగా 81 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బీకాం విభాగంలో 154 మంది మహిళా విద్యార్థులు పరీక్ష రాయగా 62 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 60 మంది పురుష విద్యార్థులు పరీక్ష రాయగా 42 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా బీకాం ఫైనాన్స్ విభాగంలో మహిళా విద్యార్థులు 22 మంది పరీక్ష రాయగా ఇద్దరు ఉత్తీర్ణత సాధించారు.
పురుష విద్యార్థులు ఆరుగురు పరీక్ష రాయగా, ఇద్దరు ఉత్తీర్ణత సాధించారు. బీఎస్సీ విభాగంలో మహిళలు 317 మంది పరీక్ష రాయగా 124 మంది ఉత్తీర్ణత సాధించారు. 200 మంది పురుష విద్యార్థులు పరీక్ష రాయగా 137 మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా బిఎ ఆనర్స్ విభాగంలో మహిళలు 18 మంది పరీక్ష రాయగా 8 మంది ఉత్తీర్ణత ఇద్దరు పురుష విద్యార్థులు పరీక్ష రాయగ ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
నాలుగవ సెమిస్టర్ లో బీఏ విభాగంలో మహిళలు 230 మంది పరీక్ష రాయగా 121 మంది ఉత్తీర్ణత సాధించారు, పురుషులు 72 మంది పరీక్ష రాయగా 51 మంది విద్యార్థులు ఉత్తిరిత సాధించారు. బీకాం విభాగంలో 153 మంది మహిళా విద్యార్థులు పరీక్ష రాయగా 67 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 90 మంది పురుష విద్యార్థులు పరీక్ష రాయగా 66 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. బీఎస్సీ విభాగంలో 223 మంది మహిళ విద్యార్థులు పరీక్ష రాయగా 113 మంది ఉత్తీర్ణత సాధించారు, పురుషులు 133 మంది పరీక్ష రాయగా 107 మంది ఉత్తీర్ణత సాధించారు. బిఏ ఆనర్స్ (సోషయాలజీ) విభాగంలో 14 మంది మహిళా విద్యార్థులు పరీక్ష రాయగా ఐదు మంది పాస్ అయ్యారు. ఆరుగురు పురుష విద్యార్థులు పరీక్ష రాయగా ఆరుగురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ విభాగంలో ఐదు మంది మహిళా విద్యార్థులు పరీక్ష రాయగా ముగ్గురు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు, పురుష విద్యార్థులు ఒక్కరు పరీక్ష రాయగా ఒకరు ఉత్తీర్ణత సాధించారు.
ఆరవ సెమిస్టర్ బిఏ విభాగంలో 197 మంది మహిళా విద్యార్థుల పరీక్ష రాయగా, 160 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 60 మంది పురుష విద్యార్థులు పరీక్ష రాయగా 56 మంది ఉత్తీర్ణత సాధించారు. కామర్స్ విభాగంలో 96 మంది మహిళా విద్యార్థులు పరీక్ష రాయగా 59 మంది ఉత్తీర్ణత సాధించారు, 71 మంది పురుష విద్యార్థులు పరీక్ష రాయగా 64 మంది ఉత్తీర్ణత సాధించారు.
బీఎస్సీ విభాగంలో 177 మంది మహిళలు పరీక్ష రాయగా 119 మంది ఉత్తీర్ణత సాధించారు, 121 మంది పురుష విద్యార్థులు పరీక్ష రాయగా 108 మంది ఉత్తీర్ణత సాధించారు. బిఏ ఆనర్స్ సోషియాలజీ విభాగంలో 11 మంది మహిళ విద్యార్థులు పరీక్ష రాయగా ఏడుగురు ఉత్తీర్ణత సాధించారు. నలుగురు పురుష విద్యార్థులు పరీక్ష రాయగా నలుగురు వ్యక్తిగత సాధించారు. బ్యాచిలర్ ఆఫ్ వోకేషనల్ విభాగంలో ఐదుగురు పురుష విద్యార్థులు పరీక్ష రాయగా ఐదుగురు పాసయ్యారు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీలత పరీక్షల నియంత్రణ అధికారి సుధీర్, డాక్టర్. గిరిప్రసాద్ అన్ని విభాగాధిపతులు పాల్గొన్నారు.