ఖిలావరంగల్, సెప్టెంబర్ 19: డాన్‌గా ఎదగాలని ప్రజలను భయభ్రాంతులకు గురిచే స్తూ.. కారణం లేకుండా దాడులకు తెగబడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిల్స్‌కాలనీ పీఎస్‌లో వరంగల్ ఏసీపీ నందిరాం నిందితుల వివరాలు వెల్లడించా రు. కరీమాబాద్ బీఆర్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మల్లికార్జున్ అలియాస్ మల్లేశ్, భూ పాలపల్లి రేగొండకు చెందిన గడ్డం సంపత్ అలియాస్ ప్రశాంత్ స్నేహితులు. వీరు కాశీబుగ్గలో ఉంటున్నారు. ఈ నెల 12వ తేదీన బీఆర్ నగర్లో వీరు రైతుపై ఉమ్మి వేయగా ప్రశ్నించినందుకు అతడిని కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో వీరిపై ఉమ్మడి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో మర్డర్, తదితర కేసులు నమోదైనట్లు ఏసీపీ వివరించారు. మల్లికార్జున్ 2004లో మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని చంపి 11 ఏళ్లు జైలు జీవితం అనుభవించాడు. ఇతడిపై గతంలో గీసుగొండ పోలీసు స్టేషన్లో ఆయుధాలు కలిగి ఉన్న కేసు నమోదైంది. గడ్డం సంపత్ 2018లో మేడారం జాతరలో మర్డర్ చేసి జైలుకు వెళ్లి వచ్చాడు.
అలాగే వర్ధన్నపేట పోలీసు స్టేషన్లో హత్యాయత్నం, మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో మూడు కొట్టుకున్న కేసులు, నల్గొండ వన్‌టౌన్ స్టేషన్లో హత్యాయత్నం, ఇంతెజార్గంజ్ స్టేషన్లో కొట్టుకొన్న కేసులు నమోదైనట్లు ఏసీపీ తెలిపారు. 2107లో సుబేదారి పీఎస్, 2018లో హసన్‌పర్తిలో పీఎస్‌లో కొట్టుకున్న కేసులు, గతేడాది డిసెంబర్ 31వ తేదీన బీఆర్‌నగర్‌లో గిరబోయిన మహేందర్‌ను ఇద్దరు కలిసి కత్తితో పొడిచిన కేసులో జైలు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. కార్యక్రమంలో సీఐ పీ మల్లయ్య ఉన్నారు.