సదస్సుకు చకచకా ఏర్పాట్లు
రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మో సాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- ఎండ తీవ్రత తట్టుకొనే జర్మనీ టెంట్లు
- పది వేల మందికి భోజన సదుపాయం
- ప్రతి పల్లె నుంచి హాజరుకానున్న రైతు ప్రతినిథులు
- గ్రామాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలు
- ప్రాంగణం, పార్కింగ్ స్థలాల పరిశీలన
హనుమకొండ, మే 4 : రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మో సాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హనుమకొండ హంటర్‌రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్‌కు ఎదురుగా ఉన్న సుమారు ఐ దెకరాల స్థలంలో పనులు ముమ్మరమయ్యాయి. ఈ సదస్సుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 10వేల మంది రైతు ప్రతినిథులు హాజరు కానున్న నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకొనేలా జర్మనీ టెంట్లు వేస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద కూలర్లు సమకూర్చుతున్నారు. పది వేల మందికి సరిపడేలా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి పల్లె నుంచి రైతు ప్రతినిథులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని, మక్కజొన్న, వడ్లు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంపై నేరుగా గ్రామాల్లో, మార్కెట్ యార్డులకు వెళ్లి బీఆర్ఎస్ నేతలు వివరిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలను వివరిస్తున్నారు.
అలాగే గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందో విశ్లేషించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. కాగా రైతు సంగ్రామ సదస్సు ప్రాంగణాన్ని, పార్కింగ్ స్థలాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, కేతిరి వాసుదేవరెడ్డి తదితరులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కొలంబియా మెడికల్ కాలేజ్ గ్రౌండ్, ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, వర్థన్నపేట నియోజక వర్గాలకు చెందిన వాహనాలు, తేజస్వీ స్కూల్ గ్రౌండ్‌తో పాటు, భారత్ పెట్రోల్ పంపుకు ఎదురుగా ఉన్న స్థలంలో స్టేషన్‌ఘన్‌పుర్, పరకాల, భూపాలపల్లి నియోజక వర్గాల వాహనాలు, పాపడమ్స్ ఎదురుగా ఉన్న పద్మాలయ ఫంక్షన్ హా ల్లో జనగామ నియోజకవర్గంతో పాటు జనరల్ వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్‌కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

