నర్సంపేట, మే 20: జమ్ముకశ్మీర్‌లో నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ కుటుంబ కలహాల తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజుల తర్వాత స్వగ్రామానికి మృతదేహం చేరుకోగా, శోకసంద్రంలో కుటుంబ సభ్యు లు, బంధువులు దహన సంస్కారాలు నిర్వహించారు. వివరాలి లా ఉన్నాయి. నర్సంపేట పట్టణం సర్వాపురం 4వ వార్డుకు చెందిన సంపంగి మల్లయ్య-విజయ దంపతులకు ముగ్గురు సంతానం.
చిన్న కుమారుడైన నాగరాజు (28) 2016లో ఆర్మీ జవాన్‌గా ఎంపికై మూడేళ్లుగా జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతమైన సాంబా సెక్టార్లో బీఎస్ఎఫ్ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత మార్చిలో సెలవుపై స్వగ్రామానికి వచ్చి ఏప్రిల్ 23న తిరిగి వెళ్లాడు. అప్పటి నుం చి నిత్యం తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడేవాడు.
ఈక్రమంలో మానసిక ఆందోళన గురైన నాగరాజు గత ఆదివారం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. జవాన్ మృతదేహాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, నాగరాజు చిన్నతనం నుంచి దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరాలనే కోరిక ఎక్కువగా ఉండేదని వారు చెప్పారు. తాను చనిపోతే ఏడవొద్దని, సంతోషంగా దహన సంస్కారాలు నిర్వహించాలని చెబుతుండేవాడని పేర్కొన్నారు.
ఏడాది వ్యవధిలోనే అన్నదమ్ములు మృతి
ఆర్మీ జవాన్ అన్న వెంకటేశ్ ఏడాది క్రితం మృతి చెందాడు. ఏడాది వ్యవధిలోనే అన్నదమ్ముల మృతి ఆ కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేసింది. వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. జవాన్ మృతదేహంపై పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నర్సంపేటలోని శ్మశానవాటిక వరకు నాగరాజు అంతిమ యాత్ర నిర్వహించారు.