హనుమకొండ చౌరస్తా, మే 21: హనుమకొండ జిల్లాలోని బీసీ కులానికి చెంది శిక్షణలో ఉన్న అడ్వకేట్ విద్యార్థులకు బీసీ అడ్వకేట్ ఉపకార వేతనాల పథకం 2025-26 సంవత్సరానిగాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎస్.లక్ష్మణ్ తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు కనీస అర్హత అర్బన్ వారికి ఆదాయపరిమితి రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలవారికి రూ.1.50 లక్షలు ఉండాలన్నారు.
అలాగే తగిన విద్యార్హతలతో కూడిన ధృవపత్రాలు, కుల ఆదాయ ధృవపత్రాలతో ఈనెల 22 నుంచి 31 వరకు ఉపసంచాలకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాల న్నారు. దరఖాస్తు చేసుకున్న నలుగురు అభ్యర్థులను జిల్లాస్థాయి కమిటీ ద్వారా ఎంపికచేస్తారని అదనపు కలెక్టర్, చైర్మన్ ఎం.శ్రీను తెలిపారు. అర్హులైన బీసీ అడ్వకేట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు.