హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 3: హనుమకొండ వడ్డేపల్లిలోని పింగళి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కెరీర్ గైడెన్స్సెల్ ఆధ్వర్యంలో ఎపికల్ సాఫ్ట్ సొల్యూషన్చే క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి మాట్లాడుతూ.. విద్యార్థినులు ఉద్యోగావకాశాలలో నైపుణ్యాన్ని కనబరిచి వివిధ కంపెనీలల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలన్నారు.
కెరియర్ గైడెన్స్కన్వీనర్ జె.లకన్సింగ్ మాట్లాడుతూ కాలేజీల్లోని అన్ని గ్రూపుల విద్యార్థినులు వారి ఉన్నత భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాంపస్ డ్రైవ్లో భాగంగా మూడో సంవత్సరం విద్యార్థినులకు మూడు దశలలో పరీక్షలు నిర్వహించి హెచ్ఆర్ కోసం ఇద్దరిని, మార్కెటింగ్ ప్లేస్మెంట్ కోసం నలుగురిని సెలెక్ట్ చేసుకున్నట్లు ఎపికల్ సాఫ్ట్ సొల్యూషన్ సీఈవో నవనీత్ తెలిపారు.