నియోజకవర్గ ప్రజల మధ్యే ఉంటా
తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల మధ్యే ఉంటానని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో గురువారం సమీక్షించారు.
- బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్
పర్వతగిరి, జనవరి 4: తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల మధ్యే ఉంటానని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో గురువారం సమీక్షించారు. తాను నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటున్నానని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. గ్రామాలే తనకు దేవాలయాలని, ప్రజలే దేవుళ్లన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఎవరూ అధైర్య పడొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సర్పంచ్‌లు, ఎంపీటీసీలుగా గెలిపించుకోవడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
2014, 2018లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేశారన్నారు. ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం పాటు పడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అరూరి కృతజ్ఞతలు తెలిపారు. మనది ఉద్యమ పార్టీ అని, ఉద్యమ స్ఫూర్తితోనే ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. త్వరలో జరుగబోయే సర్పంచ్, పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలని కోరారు. సమీక్షలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్, ఎంపీపీ కమల, పీఏసీఎస్ చైర్మన్లు మనోజ్‌కుమార్, గొర్రె దేవేందర్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జితెందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, సీనియర్ నాయకులు భాస్కర్‌రావు, వెంకటేశ్వర్రావు, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతంగౌడ్, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

