భద్రకాళి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఊరేగింపు
వరంగల్, మే 7 : భద్రకాళీ బహ్మోత్సవాలు కన్నుల పండు వగా జరు గుతున్నాయి. ఐదో రోజు శనివారం ఉదయం సూర్య ప్రభ వాహనం, సాయంత్రం హంస వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. ప్రధాన అర్చకుడు శేషు నేతృత్వంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ దంపతులు అమ్మవారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు.
వారికి అలయ ఈవో శేషుభారతి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ముదిరాజ్ మహాసభ నాయకులతో కలిసి ఆయన భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ చింతాకుల అనిల్‌కుమార్, ముదిరాజ్ మహాసభ నాయకులు బయ్య స్వామి, పులి రజనీకాంత్, పిట్టల శ్రీలత, కే యూ ప్రొఫెసర్ దినేష్, చొప్పరి సమ్మయ్య, పాల్గొన్నారు.