దుగ్గొండి, ఏప్రిల్, 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం దుగ్గొండి మండల కేంద్రంలోని పొనకల్, వెంకటాపురం, తిమ్మంపేట, తొగర్రాయి, ముద్దునూరు, పలు గ్రామాల్లో యువజన సంఘాలు పలు పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో అట్టడుగు వర్గాలకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయని అని అన్నారు. అట్టడుగు వర్గాల కోసం అంబేద్కర్ దూరదృష్టితో ఆయా వర్గాలకు న్యాయం చేయాలని రాజ్యాంగంలో వారికి ప్రత్యేకమైన హక్కులను కల్పించారని వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వివిధ యువజన సంఘాలు, నాయకులు తోకల శ్రీనివాస్ రెడ్డి, పొగాకు వెంకటేశ్వర్లు, కందిపల్లి శంకర్, పొగాకు బాలకృష్ణ, మోడం విద్యాసాగర్, మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.