గీసుగొండ, జూలై 08: వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని మనుగొండ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నిర్మల బుక్ బైండింగ్ అధినేత, మరియాపురం మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి విద్యార్థులకు 1200 వందల నోట్‌బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం విజయగిరి ప్రసాద్ మాట్లాడుతూ అల్లం బాలిరెడ్డిని అడిగిన వెంటనే 1200 నోట్‌బుక్స్ అందించారన్నారు.
వారి సహకారంతో గత ఏడాది విద్యార్థులకు షూస్, సాక్సులు కూడా ఉచితంగా అందజేశారని తెలిపారు. బాలిరెడ్డి సేవలను ఎప్పుడూ మర్చిపోలేమని అన్నారు. దాతలు అందిస్తున్న సహకారంతో విద్యార్థులు ఉన్నతంగా చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళీధర్, బషీరుల్లా బేగ్, నటరాజ్, అలివేలు, శ్రీధర్, సుమలత, జగదీష్, విజేందర్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.