తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అన్ని ఏ ర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం అన్ని కలెక్టరేట్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించనుండగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ అతిథులు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
వరంగల్ కోటలో జరి గే వేడుకలకు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి కొండా సురే ఖ, ములుగులోని తంగేడు మైదానంలో మం త్రి సీతక్క, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, మహబూబాబాద్‌లో ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, జయశంకర్ భూపాలపల్లిలో తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య హాజరుకానున్నారు.
ఈమేరకు సమీకృత కలెక్టరేట్లు, సభా వేదికలను విద్యుత్ దీపాలతో అలంకరించి అందంగా ముస్తాబు చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలిపేలా స్టాళ్ల ప్రదర్శన, విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో నేటి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.