నెక్కొండ, మే 14 : రాబోయే రోజుల్లో ప్రతి రైతుకు విశిష్ట కార్డు తప్పనిసరి కానుందని ముఖ్యమని మండల వ్యవసాయ అధికారి నాగరాజు అన్నారు. మండలంలోని పనికర గ్రామంలో రైతు విశిష్ట కార్డు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రధాన మంత్రి కిసాన్ యోజనతో పాటు ఎరువులు, విత్తనాల కొనుగోలు సందర్భాల్లో పండించిన పంటలు విక్రయించే సమయంలో విశిష్టత కార్డు తప్పనిసరి అనే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నూతన విధానాన్ని రైతుల కోసం పెడుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రైతు విశిష్టత రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి వసంత, రైతులు పాల్గొన్నారు.