హసన్పర్తి : వర్షాకాల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఫర్టిలైజర్ షాపుల్లో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఏడీఏ రాజకుమార్ సూచించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను మండల వ్యవసాయ అధికారినీ (ఏవో) అనురాధతో కలిసి ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఫర్టిలైజర్ షాపులలోని స్టాకును, రిజిస్టర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలన్నారు. రైతులు కొనుగోలు చేసిన వెంటనే రిజిస్టర్లో పొందుపరిచి తప్పని సరిగా రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. లేని పక్షంలో డీలర్ల పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా కొనుగోళ్లు చేసినప్పుడు రసీదులు తప్పకుండా తీసుకోవాలని సూచించారు.