భూపాలపల్లి రూరల్, మే 13: ‘మన ఊరు-మన బడి’లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భవేశ్ మిశ్రా హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాల యంలో ఆయన జిల్లా, మండలాల స్పెషల్ ఆఫీస ర్లతో ఈ కార్యక్రమంపై సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా ర్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల్లో అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం, మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆరు నుంచి పదో తరగతి వర కు గల పాఠశాలల్లో తప్పనిసరిగా ఐదు తరగతి గదులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు.
మండలాల స్పెషల్ ఆఫీసర్ల వద్ద వారి పరిధిలోని స్కూల్స్‌కు సంబంధించిన అన్ని ఫొ టోలు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టనున్న కిచెన్ షెడ్స్, కంపౌండ్స్ వాల్ల నిర్మాణాలను మండలాల వారీ గా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో కల్పించ నున్న మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యే క ప్రణాళిక సిద్ధం చేసిందని, దీని ఆధారంగా పా ఠశాలల్లో పనులు పూర్తి చేయాలని అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీని వాస్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ స్వర్ణలత, జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్డీవో పు రుషోత్తం, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శైలజ, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, డీపీవో ఆశా లత, జిల్లా హార్టికల్చర్ అధికారి అక్బర్, డీఏవో విజయ భాస్కర్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.