హనుమకొండ, సెప్టెంబర్ 17: అక్టోబర్ 16 నుంచి 18 వరకు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగే 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ఛాంపియన్షిప్కు హైదరాబాద్ ఏసీబీ డైరెక్టర్ డాక్టర్ తరుణ్జోషిని హైదరాబాద్‌లో బుధవారం తెలంగాణ అథ్లెటిక్స్అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పగిడిపాటి వెంకటేశ్వర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జాతీయ అథ్లెటిక్స్పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన క్రమంలో మొదటిసారి నిర్వహించిన జాతీయ అథ్లెటిక్స్పోటీలను కలిసికట్టుగా అందరం విజయవంతం చేసినట్లు తరుణ్‌జోషి గుర్తుచేసినట్లు చెప్పారు.