నిజాంపేట,మే7 : బతుకుదెరువు కోసం హైదరాబాద్ పట్టణానికి వెళ్లి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజాంపేట చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన కొమ్మాట రఘు(23) ఉపాధి కోసం ఆరు నెలల క్రితం హైదరాబాద్కు వెళ్లి అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు.
ఈ క్రమంలో దుండిగల్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రఘు మృతి చెందాడు. అందరితో స్నేహపూరితంగా ఉన్న రఘు మరణవార్త విన్న స్నేహితులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.